బుధవారం మధ్యాహ్న తమ ఛాంబర్ లో ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వి.శ్రీనివాస్ తో కలిసి జాతీయ లోక్ అదాలత్ పై విలేకరులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ,లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. ఈ సేవలు ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందించబడతాయన్నారు.సెప్టెంబర్ 13న శనివారం,గద్వాల్ లోని న్యాయస్థాన ప్రాంగణంలో లోక్‌అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.