ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని రేషన్ కార్డుదారులకు ఎమ్మార్వో వెంకటేశ్వర్లు పలు సూచనలు చేశారు. రేషన్ కార్డులో పేర్లు తప్పులు చిరునామా మార్పులు కొత్తగా సభ్యుల చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. సవరణ కోసం సచివాలయాల్లో లేదా మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేవైసీ ప్రక్రియ పూర్తయిన కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు త్వరలో జారీ చేస్తున్నట్లు తెలిపారు. కార్డుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.