కోటి మంది మహిళామణులను కోటీశ్వరులగా తీర్చిదిద్దాలనే మహోన్నత లక్ష్యంతో ఇందిరా మహిళాశక్తి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.కలెక్టరెట్ ఎదుట కళ్యాణి స్వయం సహాయక సంఘానికి చెందిన మంజుల అనే మహిళ 2 లక్షల ఋణం తో ఏర్పాటు చేసిన వనిత టీ స్టాల్ ను బుధవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు.కలెక్టర్ స్వయం గా స్టవ్ వెలిగించి పాలు పెట్టి వ్యాపారం బాగా జరగాలని ఈ సందర్బంగా కోరారు. అధికారులతో కలిసి కలెక్టర్ టీ తాగి రుచికరంగా ఉందని SHG మెంబర్ మంజుల ను కలెక్టర్ అభినందించారు.