వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం లోని కొత్తూరు, వడిచర్ల, మెట్ల కుంట, రేగడి మైలారం గ్రామాల్లో సోమవారం వికారాబాద్ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ రాజేష్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ జయకృష్ణ తో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యాన్ని విక్రయించి అధిక లాభాలు పొందాలని సూచించారు.