Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 30, 2025
బీజేపీలో సీనియర్ నాయకత్వానికి పెద్దపీట వేయాలని పలువురు తీర్మానించారు. వింజమూరులోని వీఆర్ ఫంక్షన్ హాల్లో బీజేపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ నేతలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పులిచెర్ల నారాయణరెడ్డి, కదిరి రంగారావు పాల్గొన్నారు.