తాడిపత్రి మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రిలో అడుగుపెట్టనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డికి రూట్ క్లియర్ అయింది. జిల్లా SP జగదీశ్ ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దారెడ్డి తన స్వగ్రామం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి ఉదయం 9 గంటలకు తాడిపత్రికి చేరుకోనున్నారు. దాదాపు 15 నెలల తర్వాత ఆయన తాడిపత్రికి వస్తున్నారు.