శ్రీకాకుళం జిల్లా పాతపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఓ గొర్రెల మందను రైలు ఢీకొంది. ప్రమాదంలో రెండు గొర్రెలు, రెండు మేకలు అక్కడికక్కడే మృతిచెందగా పలు మూగజీవాలు గాయాల పాలయ్యాయి. గొర్రెల మంద రైల్వే ట్రాక్ దాటుతుండగా రాజా రాణి ఎక్స్ప్రెస్ రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన గొర్రెల కాపరి ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు..