నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులకు గాను 697.975 అడుగులలో నీటి నిల్వ కొనసాగుతుంది, 4.699 టీఎంసీలకు గాను 4.197 TMC లలో ప్రాజెక్టు సామర్థ్యం చేరుకుందన్నారు. ఇన్ ఫ్లోగా ప్రాజెక్టులోకి 1413 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందన్నారు. ఎడమ కాలువకు 495 క్యూసెక్కులు కుడి కాలువకు 14 క్యూసెక్కుల నీటిని సాగుకు వదులుతున్నామని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.