తణుకు సజ్జాపురంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామివారిని కరెన్సీతో మంగళవారం రాత్రి 7 గంటలకు అలంకరించారు. సుమారు రూ.16.50 లక్షల విలువైన వంద నోట్లతో స్వామి వారిని అలంకరించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈనెల 10న స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.