జనసేన పార్టీ అధ్యక్షుడు,రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను కాకినాడ నగరంలో స్థానిక సాలిపేటల్లో గల జనసేన పార్టీ కార్యాలయం వద్ద నగర అధ్యక్షుడు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కొర్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్,డిసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామిలు పాల్గొని పుట్టినరోజు కేకును కట్ చేసి వేడుకలు జరిపారు.ఈ సందర్భంగా తోట సుధీర్,అనంతలక్ష్మీలు మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అని,అటువంటి నాయకుడి నేతృ