ఈరోజు 27వ తారీకు నుండి 31 వ తారీకు వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్ననేపద్యంలో జిల్లా కలెక్టరేట్ నుంచి మహబూబాబాద్ జిల్లా ప్రజలకు అప్రమత్తం చేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు,ఈరోజు 27 వ తారీఖున పలు జిల్లాలతో పాటు మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారని 28 నుండి 31వ తేదీ వరకు యెల్లో అలర్ట్ జారీ చేయడం జరిగిందని కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు అదేవిధంగా వర్ష ప్రభావిత వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు