తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సిర్పూర్ టి మండలంలోవరద నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వెంకట్రావుపేట పోడ్స మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గత మూడు రోజుల నుండి నదిలో వరద నీరు క్రమక్రమంగా పెరగడంతో రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. వరద నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు,