రుద్రవరం మండలానికి చెందిన వైసీపీ సీనియర్ నేత గంధం నాగిరెడ్డి మంగళవారం ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ నాయకుడు ఇరిగెల రాంపుల్లా రెడ్డి, ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇరిగెల మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున గంధం కుటుంబం జనసేన పార్టీలోకి రావడం ఎంతో శుభపరిణామం అన్నారు.