గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్ రాజ్యాంగం కల్పించిన హక్కు అని నారాయణఖేడ్ మండలం భారత రాష్ట్ర సమితి ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాజు నాయక్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం మాద్వార్ లో బుధవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఎస్టీల జాబితా నుండి గిరిజనులను తొలగించేందుకు సోయం బాపూరావు , వెంకట్రావు లు సుప్రీంకోర్టులో వేసిన కేసులు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టులో వేసిన కేసు కు సరైన రీతిలో సమాధానం ఇవ్వాలని సూచించారు.