ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన లక్షిత్ అనే నాలుగు సంవత్సరాల బాలుడు జూలై 8వ తేదీన అంగన్వాడి కేంద్రానికి వెళ్లి అదృశ్యమైన బాలుడు జులై 10వ తేదీన సూరే పల్లి సమీపంలోని పొలాలలో శివమైతే వెళ్ళాడు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే లక్ష కాల్స్ డేటాను సేకరించిన పోలీసులు 80 వేల కాల్స్ పరిశీలించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని పోలీసులు బుధవారం తెలిపారు. అయితే ఈ మృతి పై కుటుంబ సభ్యులు ఇప్పటికే అనుమాన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం పోలీసులు అతి త్వరలో వెల్లడిస్తారని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.