కడప జిల్లా పులివెందల్లో మెడికల్ కళాశాల భవన నిర్మాణం పూర్తి చెయ్యకుండానే కాలేజీ ప్రారంభించాలని జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని పులివెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. 50% కూడా మెడికల్ కాలేజీ బోనాలు పులివెందులలో పూర్తి కాలేదని చెప్పారు. కాలేజీ భవనాలు లేకుండా పిల్లలకు హాస్టల్ లేకుండా సిబ్బందికి వసతి లేకుండా కాలేజీని ఎలా ప్రారంభించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. రోడ్డుకు ఎదురుగా రెండు భవనాలను కట్టి అదే మెడికల్ కాలేజ్ అని ప్రజలను జగన్ తప్పుదోవ పట్టిస్తున్నాడని చెప్పారు. కాలేజీ పెండింగ్ బకాయిలను 40 కోట్లు చెల్లించామన్నారు.