రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి తప్ప రైతుల సమస్యలు పట్టవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 12 గంటలు కర్నూలు లో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో యూరియా కొరత తో అల్లాడుతున్న రైతన్న ఆదుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 4 వేల పెన్షన్ కోసం 4 కోట్లు ఖర్చుపెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మిర్చి,పత్తి, మామిడి, ఉల్లి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే రైతు సమస్యలను గాలికి వదిలేశారని తెలిపారు.