శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి పేరుతో బద్వేలును జిల్లాను ఏర్పాటు చేయాలని సోమవారం ప్రత్యేక జిల్లాసాధన సమితి అధ్యక్షులు మరియు బద్వేల్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, అడ్వకేట్ బ్రహ్మారెడ్డి తెలిపారు.కడప జిల్లా బద్వేల్ లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాల పునర్విభజన మరియు నూతన జిల్లాల ఏర్పాటు క్రమంలో ఎన్డిఏ ప్రభుత్వము తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు, పరిపాలన సౌలభ్యం కొరకు బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు,ఈ ప్రాంతాలకు అతి చేరువలో ఉన్న ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలను ఏకీకరణ చేసి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు.