రామాయంపేట మండలం పర్వతాపూర్ వద్ద రోడ్డు తెగిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం ఏర్పడింది. గత మూడు రోజులుగా కురిసిన అతి భారీ వర్షాల నేపథ్యంలో పుష్పల వాగు పొంగిపొర్లడంతో పర్వతాపూర్, కాట్రియాల మధ్య ఉన్న రోడ్డు వంతెన పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో పర్వతాపూర్, కాట్రియాల, కిషన్ తండా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు చేరి వందల ఎకరాల్లో పంటలలో ఇసుక మెటలు వెయడంతో నష్టం జరిగినట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పై ఎలాంటి ఆశా లేదని తాము ఇన్ని రోజులు శ్రమించి చేసిన కష్టం మొత్తం కొట్టుకుపోయిందని మొత్తం ఇసుక మెటలు, చెట్లు, రాళ్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.