బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఖేడ్ పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నారాయణఖేడ్ మండలం అధ్యక్షుడు పరమేష్, మాజీ జడ్పీటీసీ రవీందర్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, మాజీ ఎంపిటిసి ముజమిల్, మాజీ వైస్ చైర్మన్ పరుశురాం మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా సీబీఐ కేసు పెట్టిందని విమర్శించారు. కెసిఆర్ పై సిబిఐ కేస్ పెట్టి పైసాచికానందాన్ని పొందుతున్నారని విమర్శించారు.