సురవరం సుధాకర్ రెడ్డికి రేణిగుంటలో నివాళి సురవరం సుధాకర్ రెడ్డి మృతి భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని నష్టమని రేణిగుంట మండలం సీపీఐ కార్యదర్శి వైఎస్ మణి అన్నారు. రేణిగుంట మండల సమితి రైల్వే స్టేషన్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. రైతు కోసం, కార్మికుల కోసం, ప్రతి అణగారిన వారి కోసం సురవరం చేసిన పోరాటం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు.