ఆరేళ్ల విరామం తర్వాత.. కబడ్డీ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ప్రో కబడ్డీ లీగ్ తిరిగి విశాఖపట్నానికి వస్తోంది. 12వ సీజన్ తొలి దశ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. స్థానిక ఫ్రాంచైజీ తెలుగు టైటాన్స్ సొంత అభిమానుల మధ్య టైటిల్ వేటకు సిద్ధమవుతోంది. గత సీజన్‌లో కేవలం త్రుటిలో ప్లేఆఫ్ అవకాశాన్ని కోల్పోయిన టైటాన్స్.. ఈసారి హోమ్ అడ్వాంటేజ్‌ను సద్వినియోగం చేసుకొని చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉంది.ఈసారి వేలంలో 4.5 కోట్లు ఖర్చు చేసి టైటాన్స్ యాజమాన్యం పక్కా ప్రణాళికతో జట్టు కూర్పు చేసింది.