మానవతా దృక్పథంతో అంబులెన్స్ నిర్వాహకులు సేవలు అందించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షులు సాకేహరి డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని ఎల్జీవోహంలో అంబులెన్స్ నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోగుల సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి చేయాలని పిలుపునిచ్చారు.