ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు ఆసుపత్రి సేవలపై నమ్మకం కలిగించేలా వైద్యులు సేవలందించాలని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉప్పునుంతల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలు ఔషధ నిలువలు వార్డుల పరిశుభ్రత అంశాలను పరిశీలించారు.