తాడుర్ మండలం గోవిందాయ్ పల్లి గ్రామంలో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గోవిందపల్లి గ్రామానికి చెందిన రామస్వామి చేపల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు... స్థానికులు గమనించి సోమవారం ఫైర్ అధికారులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది వెలికి తీశారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.