రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కామారెడ్డి ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపిందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని జి ఆర్ కాలనీలో గురువారం రెండు గంటల సమయంలో ఆయన మాట్లాడుతూ... వరదల్లో ప్రాణ నష్టం జరగకుండా సమర్థవంతంగా పని చేసిన అధికారులను ఆయన అభినందించారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల మరమ్మతులను వేగవంతంగా పూర్తి చేయించాలని సీఎంను కోరారు. నియోజకవర్గంలో వరదల వల్ల తలెత్తిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.