శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మున్సిపాలిటీకి నీటిని సరఫరా చేసి దొరిగల్లు వాటర్ పంప్ హౌస్ కదిరి మున్సిపల్ కమిషనర్ కిరణ్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు శనివారం పరిశీలించారు. దొరిగల్లు పంప్ హౌస్ లో మోటార్లు మరమ్మతులకు గురి కావడంతో కదిరి పట్టణానికి నీటి సమస్య ఏర్పడింది. సమస్యను అధిగమించడానికి మోటార్లను త్వరితగతిన మరమ్మతు చేయించి, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.