అనంతపురం నగరంలోని మార్కెట్ యార్డ్ సమీపన ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని బుక్కరాయసముద్రం మండలం వడియం పేటకు చెందిన తరుణ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అవడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతపురం టౌన్ నుండి వడియం పేటకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా మార్కెట్ యార్డ్ సమీపాన ఈ ప్రమాదం జరిగినది. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తరుణ్ కు చెయ్యి విరిగినదని, తలకు తీవ్ర గాయాలయ్యాయని అత్యవసర విభాగం వైద్యులు డాక్టర్ ఆనంద్ బాబు తెలిపారు.