ఆలూరు మండల కేంద్రంలో ప్రీ మెట్టిక్ బాలికల అదనపు హాస్టల్ ఏర్పాటు చేయాలని, ఆలూరు ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నారాయణ ఆదివారం వారి నివాసంలో తెలిపారు. రేపు విద్యార్థుల సమస్యలపై కర్నూల్ లో జరిగే కలెక్టరేట్ కార్యక్రమంలో విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్నామని అన్నారు. ఆలూరులో ప్రధానమైన ఈ సమస్యపై ఆందోళన చేస్తున్న అధికారి స్పందించకపోవడం బాధాకరం ఇప్పటికైనా అధికారులు స్పందించి హాస్టల్ ఏర్పాటు చేయాలని, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఆందోళన చేస్తామన్నారు.