ఒంటిమిట్టలో నేడు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. నేడు తిరుపతి నుంచి కడపకు వెళ్తున్న ఆయనను ఒంటిమిట్ట మఠంపల్లి దాబా దగ్గర జడ్పిటిసి ముద్దుకృష్ణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని జడ్పిటిసి సన్మానించారు ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.