కరీంనగర్ సీతారాంపూర్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలో ఎలాంటి ప్రభుత్వ మున్సిపల్ అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ తో పాటు రేకుల షెడ్డు ను కూల్చివేశారు కరీంనగర్ మున్సిపల్ అధికారులు. అనుమతి లేకుండా చల్లా వెంకట రమణ రెడ్డి ఇల్లు నిర్మించారు కరీంనగర్ కు చెందిన ఆసం రాధాకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం ఆ ఇంటిని ప్రహరీ గోడను మున్సిపల్ కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా సిబ్బంది కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కూల్చివేతల లో ఏసీబీలు శ్రీధర్, వేణు, టిపిఎస్ సంధ్య, తేజస్విని, రాజ్ కుమార్, డిఆర్ఎఫ్ ఇంచార్జ్ లక్ష్మణ్, ఇమ్మడోజు విజయ్, రాగిడి బాబు పాల్గొన్నారు.