పెనుగొండ మండలం కొటలపర్రు శివారు వీరప్ప చెరువులో దారుణం జరిగింది. భర్త వెంకటనారాయణ, భార్య అనంతలక్ష్మికి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు అవుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున మరోసారి వీరిమధ్య వివాదం చెలరేగింది. కోపోద్రిక్తురాలైన భార్య టార్చ్ లైట్తో భర్త తలపై వెనుక భాగంలో బలంగా కొట్టడంతో వెంకటనారాయణ అక్కడికక్కడే మరణించాడు. దీనిపై మంగళవారం సాయంకాలం 6 గంటలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు.