తుర్కయంజల్ మాసబ్ చెరువు దగ్గర వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాట్లను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శనివారం మధ్యాహ్నం పరిశీలించారు. అనంతరం ఆయన దిల్సుఖ్నగర్ కు చెందిన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి గంగమ్మ ఒడికి చేర్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మాసబ్ చెరువు ప్రాంతమంతా గణపయ్య నామస్మరణతో మారు మోగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.