కల్లూరు మండలం పెద్దపాడుకు చెందిన కె.మహేశ్ బాబు డీఎస్సీ ఫలితాల్లో 3 ఉద్యోగాలు సాధించారు. టీజీటీలో 85.20 మార్కులతో స్టేట్ టాపర్గా, పీజీటీలో 84 మార్కులతో జోన్-4 టాపర్గా, ఎస్ఏ తెలుగులో 85.62 మార్కులతో జిల్లా టాపర్గా గా నిలిచాడు. ఈయన తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, పార్వతి రోజూ కర్నూలుకు వచ్చి కూలీ పనులు చేస్తారు. ప్రస్తుతం రాయలసీమ యూనివర్సిటీలో తెలుగులో పీహెచ్ఎ చేస్తున్నారు.