ఆడపిల్లలను రక్షించుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని మండల విద్యాధికారి శంకర్ అన్నారు. మంగళవారం దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బేటి బచావో బేటి పడావో అవగాహన కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆడపిల్లల రక్షణ, సమాజంలో వాళ్లు ఏ విధంగా నడుచుకోవాలో వంటి విషయాలపై అవగాహన కల్పించారు. ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్, ఐసిడిఎస్ సిబ్బంది, హెల్త్ కౌన్సిలర్ లావణ్య ఉన్నారు.