ఉల్లి రైతులపై వైసిపి ఫేక్ ప్రచారాలు చేస్తోందని, సి.బెలగల్ మండలంలోని పోలకల్ గ్రామంలో ఉల్లి రైతులు పురుగుమందు తాగినట్లు హైడ్రామా నడిపించారని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి విమర్శించారు. సోమవారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉల్లి రైతుల ఇబ్బందులను చూసి సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు ధర రూ. 1200 ప్రకటించారని గుర్తు చేశారు. వేలంలో తక్కువ ధర వస్తే మిగతా సొమ్ము ప్రభుత్వం జమ చేస్తున్నట్లు తెలిపారు. రైతులు వైసీపీ మాయలో పడవద్దని సూచించారు. వైసీపీ పాలన అంతా ప్రజలకు తెలుసన్నారు.