Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 2, 2025
దుత్తలూరు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పరిసరాలను, గదులను పరిశీలించి.పరిశుభ్రత లేనందున సిబ్బందిని హెచ్చరించారు. పనితీరు మార్చుకోవాలని లేదంటే పలాయనం చెందాల్సి వస్తుందన్నారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరికరాలు సరిగా ఉన్నాయా లేదా అని అడిగారు. ఆసుపత్రిలో బీపీని చెకప్ చేయించుకున్నారు. సిబ్బంది తీరు మెరుగుపరచుకోవాలన్నారు. అనారోగ్యంతో వచ్చే వారిని గౌరవప్రదంగా గౌరవించి వారికి మంచి వైద్యం అందించి తగిన మందులు ఇచ్చి పంపించాలన్నారు. ప్రజా ఆరోగ్యం కోసం పనిచేయాలని తెలియజేశారు.