రాష్ట్రాన్ని విద్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేసునేని చిన్ని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో రెండు కోట్ల పది లక్షల రూపాయల వ్యయంతో ఆధునికరించిన బి ఎస్ ఆర్ కె హై స్కూల్ ను శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఆయన ప్రారంభించారు అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తదితరులు పాల్గొన్నారు.