భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శిగా పోతిరెడ్డి భాస్కర్, సహాయ కార్యదర్శిగా ఎస్.షా వల్లిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా కార్యవర్గ సభ్యుడు పి.శ్రీరాములు తెలిపారు. పేద ప్రజల సమస్యల పట్ల నిత్యం పోరాడాలని సూచించారు. నూతన కార్యదర్శి, సహాయ కార్యదర్శికి పలువురు అభినందనలు తెలిపారు.