అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి పెరుగు పాలెం కు చెందిన జోగన్న అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.