నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లకు శక్తి టీం శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించింది. హెడ్ కానిస్టేబుల్లు ప్రసాద్, రఫీ, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. రాత్రి వేళల్లో మహిళలను సురక్షితంగా గమ్యం చేరవేయాలని, మద్యం మత్తులో ఆటోలు నడపరాదని హెచ్చరించారు.