అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం గోవిందం పల్లి పంచాయతీ శంకరాపురం హరిజనవాడలో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం నుండి మూడు రోజులు పాటు గణనాథుడికి పూజలు చేశారు. శుక్రవారం చివరి రోజు గ్రామంలో ఊరేగించారు. ఈ ఊరేగింపులో గ్రామస్తులందరూ సందడిగా రంగులు జల్లుకొని, డాన్స్ లేస్తూ నిమజ్జలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జ్యోతి సుబ్రహ్మణ్యం, చదర్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.