శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలో ఎరువులు కొనుగోలు చేయడానికి రైతులు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. అధిక డిమాండ్ కారణంగా దుకాణ యజమానులు పోలీసులను ఆశ్రయించారు. సోమవారము సాయంత్రం నరసన్న పేట ప్రధాన రహదారిలో ఎరువుల దుకాణాల వద్ద పోలీసుల సమక్షంలో ఎరువుల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది కూడా రైతులకు ఎరువుల కొరత తప్పేలా లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంలో ఆందోళన కలిగిస్తుంది.