విజయవాడ న్యూ రాజేశ్వరి పేట ప్రాంతంలో డయేరియాతో బాధపడుతున్న ప్రజల్ని అధికారులు ఎవరు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. గురువారం సాయంత్రం సమయంలో స్థానిక ప్రజలు హెల్త్ క్యాంపు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. తమ కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే అధికారులు ఎవరూ ఎటువంటి సమాధానం చెప్పలేదని సరైన మందులు కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు . అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.