పుకార్లు,తప్పుడు వార్త కథనాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉదేశ్యపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అదేశించారు.ఓ దిన పత్రిక అర్ధం వచ్చేలా డేట్ లైన్ మార్ఫింగ్ చేసిన తప్పుడు వార్త కథనాన్ని ప్రముఖ దిన పత్రికలో వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని, దీనికి సంబంధించిన సోషల్ మీడియా క్లిప్పింగ్‌లను జతపరుస్తు వారిపై చర్యలు తీసుకోవాలని ఆ దినపత్రిక ప్రతినిధులు పోలీస్ కమిషనర్ ని కలసి ఫిర్యాదు చెశారు.