కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్, ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలలో పనులు చేయిస్తానని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న మహమ్మద్ నజీర్ కాన్ను పోలీసులు అరెస్టు చేసి ఎమ్మార్వో మధుకర్ ఎదుట బైండవర్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలలో పనుల కోసం నేరుగా అధికారులను మాత్రమే సంప్రదించాలని మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో మధుకర్ హెచ్చరించారు,