భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో పంట నీట మునిగి పూర్తిగా నష్టపోయిందని ఈ విపత్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు రుద్రూర్ మండల కేంద్రంలో నష్టపోయిన పంట పొలాలను పార్టీ నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట పొలాలతో పాటు ఇండ్లు ధ్వంసమై నిరాశ్రయులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గుంతలు ఏర్పడిన రోడ్లకు మరమత్తులు చేపట్టాలని కోరారు.