ఏనుగుల వలన నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని కొమరాడ మండల సిపిఎం కార్యదర్శి కొల్లి సాంబమూర్తి కోరారు. గురువారం గుమ్మడ గ్రామానికి చెందిన కౌలు రైతు చిప్పాడ గౌరు నాయుడు పండించిన జొన్న, పత్తి పంటలను ఏనుగులు ధ్వంసం చేసిన నేపథ్యంలో వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఏనుగులు 12 మంది వ్యక్తులను పొట్టన పెట్టుకోగా, సుమారు 6 కోట్ల రూపాయలు పంటలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. పంటలు నష్టమైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.