తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం నెల్లబల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నాయుడుపేట నుంచి సూళ్లూరుపేట వైపు వెళ్తున్న బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నాయుడుపేటకు చెందిన రఫీ, శీనయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం నాటికి వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.