సీ బెలగల్ మండలంలోని బ్రాహ్మణ దొడ్డి గ్రామంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సోమవారం ఉదయం ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే పింఛన్ సొమ్ము అందిస్తూ సంక్షేమంపై ఆరా తీశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి హామీ నెరవేరుస్తూ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. పింఛన్లు తొలగిస్తున్నారనే అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు.